Published On:

DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర సర్కార్.. 2 శాతం డీఏ పెంపు

DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర సర్కార్.. 2 శాతం డీఏ పెంపు

2 Percent Increase in DA For Electricity Employees: విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పెంచిన డియర్ అలవెన్స్ ఈ ఏడాది జనవరి నుంచి అమలు కానుందని ప్రకటించారు. రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

 

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా కావాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబమని కొనియాడారు. ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరారు.

 

భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. డీఏ పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రాన్స్ కో యాజమాన్యంతో పాటు కొంతమంది సభ్యులు ప్రజా భవన్‌కు బయలుదేరారు. అనంతరం జేఏసీతో పాటు ట్రాన్స్ కో మేనేజ్ మెంట్, డిస్కంలకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం డీఏ విడుదల చేయగా..ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: