Last Updated:

Brahmanandam Son: కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి

ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్‌ పద్మజా వినయ్‌ కుమార్తె, డాక్టర్‌ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

Brahmanandam Son: కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి

Brahmanandam Son: ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్‌ పద్మజా వినయ్‌ కుమార్తె, డాక్టర్‌ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులతో పాటు ఎంగేజ్ మెంట్ వేడుకకు ఆలీ దంపతులు, సుబ్బరామిరెడ్డి సహా సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఈ ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.

 

 

నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజా గౌతమ్‌ ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పలు సినిమాల్లో నటించారు. రెండో కుమారుడు సిద్దార్థ్‌.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.