Allu Arjun – Trivikram Combo: అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీకి సంబంధించి క్రేజ్ అప్‌డేట్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

Allu Arjun and Trivikram Movie Latest Update: పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. విడుదలైనప్పటి నుంచి ‘పుష్ప 2’ రికార్డుల మీద రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో సౌత్ సినిమాలకు అసాధ్యమనుకున్న రికార్డును ఈజీగా బ్రేక్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద హిందీ చిత్రాలకు సైతం రాని కలెక్షన్స్‌ని పుష్ప 2 రాబట్టింది. అక్కడ భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు నెలకొల్పింది. ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండోవ సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇక దీనికి పార్ట్ 3 కూడా ఉంది.
పుష్ప 2 భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఏంటా? అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 రిలీజై రెండు నెలల దాటిపోయింది. ఇప్పటికి బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప్రకటించలేదు. నెక్ట్స్ డైరెక్ట్ అట్లీ, సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్‌లతో చర్చలు జరిగినట్టు వార్తలు వినిపించాయి. పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగా? అట్లీ? అనే చర్చ జరిగింది. అయితే ఈ రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్టు సమాచారం. అయితే అందులో బన్నీ త్రివిక్రమ్‌కే ఓటు వేయగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారని సమాచారం. ఇదోక మైథలాజికల్ డ్రామా మూవీ అని, పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రానుందట.
ప్రస్తుతం ఈ సినిమా కోసం బన్నీ సన్నద్దం అవుతున్నాడట. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్‌ని అయిపోయిందని, రీసెంట్‌గా బన్నీని కలిసి పూర్తి స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ప్రారంభించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. కాగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ హిట్ కాంబో. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి.
మరోసారి ఈ వీరిద్దరు పాన్ ఇండియా చిత్రం కోసం జతకట్టారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్‌కు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రమైన, బన్నీ మ్యానరిజానికి తగ్గట్టు స్క్రిప్ట్ డిజైన్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప1, పుష్ప 2 చిత్రాలతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. మరి నార్త్, సౌత్ ఆడియన్స్‌ని త్రివిక్రమ్ మెప్పిస్తాడా? లేదా? అనేది సినీవర్గాలను ఆలోచింపజేస్తున్న అంశం. ఏదేమైనా ఈ హిట్ కాంబో మళ్లీ రిపిట్ అవుతుండటంతో అభిమానుల్లో మాత్రం ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.