Published On:

Allu Arjun @NATS 2025: డైలాగ్స్‌‌తో పిచెక్కించిన ఐకాన్ స్టార్.. తెలుగోళ్లంటే ఫైర్‌ అనుకున్నారా..? వైల్డ్‌ ఫైర్‌..!

Allu Arjun @NATS 2025: డైలాగ్స్‌‌తో పిచెక్కించిన ఐకాన్ స్టార్.. తెలుగోళ్లంటే ఫైర్‌ అనుకున్నారా..? వైల్డ్‌ ఫైర్‌..!

Allu Arjun @NATS 2025: అమెరికాలో అంగరంగ వైభవంగా నాట్స్ 2025 సంబరాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్‌, హీరోయిన్‌ శ్రీలీల, డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, దర్శకుడు సుకుమార్‌, తదితర టాలీవుడ్‌ స్టార్స్‌ పాల్గొని సందడి చేశారు. ఇక సంబరాల్లో అల్లు అర్జున్‌ డైలాగ్స్‌‌తో అభిమానులకు పిచెక్కించారు. అమెరికాలో ఇలా తెలుగువాళ్లందరూ కలవడమనేది అద్భుతం అని.. నాట్స్‌ సంబరాలకు నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందంటూ ఆయన మొదలు పెట్టారు.

 

ఇక మెల్లగా మన పుష్ప డైలాగ్స్‌ వదులుతుంటే అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఇండియన్స్‌ ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులో తెలుగోళ్లయితే అస్సలు తగ్గేదేలే.. అని పుష్ప స్టైల్‌లో అల్లు అర్జున్‌ చెప్పారు. అంతేకాదు నాట్స్‌ అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌’ అని.. తెలుగోళ్లంటే ఫైర్‌ అనుకున్నారా..? వైల్డ్‌ ఫైర్‌’ అని డైలాగ్స్‌తో రచ్చ రచ్చ చేశారు. ఇక అభిమానులు ఆగుతారా.. విజిల్స్‌, అరుపులు, చప్పట్లతో సభా దద్దరిల్లిపోయేలా చేశారు.

 

అసలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే అభిమానులు పడి చచ్చిపోతారు. అలాంటిది పుష్ప మూవీ రావడంతో తగ్గేదేలే.. అంటూ అల్లు అర్జున్‌ని ఆకాశనంటించారు. ఎక్కడ చూసిన పుష్ప డైలాగ్స్‌ వినిపించేవి.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పుష్ప డైలాగ్స్‌‌కు డైహాడ్ ఫ్యాన్స్‌యే.. మరి ఇంతా ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. పోరుగు దేశంలో మన సినిమా డైలాగ్స్‌ కొడితే ఇంకా ఏమైనా ఉందా.. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చేశాయ్.. ఇక చివర్లో కూడా యాంకర్‌ శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. మీ యాంకరింగ్‌ మాత్రం రప్పా రప్పా అని అల్లు అర్జున్‌ పొగిడేశారికి అభిమానులు ఊగిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు అందరి నోట ఒకటే నాట్స్ 2025 సంబరాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన తెలుగోడు మాట్లాడితే ఎలా ఉంటుందో చూపించాడని వినిపిస్తుంది.

 

ఇవి కూడా చదవండి: