IIST: IIST లేదా IIT లో ఏది బెస్ట్.. IISTకి అబ్దుల్ కలాంకు ఉన్న సంబంధం ఏంటి?
IIST: IIST లేదా IIT లో ఏది బెస్ట్. అసలు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ ఇనిస్టిట్యూట్ ఎందుకంత ప్రత్యేకం అసలు IISTకి అబ్దుల్ కలాంకు ఉన్న సంబంధం ఏంటి అనే పూర్తి వివరాలు డాక్టర్ సతీష్ కుమార్ మాటాల్లో తెలుసుకుందాం.
IIST: IIST లేదా IIT లో ఏది బెస్ట్. అసలు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ ఇనిస్టిట్యూట్ ఎందుకంత ప్రత్యేకం అసలు IISTకి అబ్దుల్ కలాంకు ఉన్న సంబంధం ఏంటి అనే పూర్తి వివరాలు డాక్టర్ సతీష్ కుమార్ మాటాల్లో తెలుసుకుందాం.
రాష్ట్రపతిగా ఉన్నకాలంలో అబ్దుల్ కలాం కలల ఇనిస్టిట్యూట్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(IIST) అని చెప్పవచ్చు. ఏసియాలోనే మొట్టమొదటి స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఇది. ఈ కళాశాల కేవలం కేరళలోని తిరువనంతపురంలో మాత్రమే ఉంది. 2007లో ఈ కళాశాల ప్రారంభం అయ్యింది. ఈ ఇనిస్టిట్యూట్ ని స్వయంగా ఇస్రోనే నడిపిస్తూ ఉంటుంది. ఈ ఇనిస్టిట్యూట్లో ఏటా 174 అడ్మిషన్లు మాత్రమే ఉంటాయి.
ఇకపోతే IIT మద్రాసులో కూడా ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఇందులో చదివిన వారు ఎన్నో చోట్ల ఉద్యోగాలకు లేదా వేరే కోర్సులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ IISTలో మాత్రం కేవలం స్పేస్ టెక్నాలజీలో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. అందులోనూ వెంటనే ఇస్రోలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే IISTలో చదివిన విద్యార్థులకు సబ్జెక్ట్ మీద కమాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఫీజులు, ఉద్యోగం ఇలా(IIST)
ఇక్కడ ఫీజు కూడా ఒక్కొక్క సెమిస్టర్ కి 5 లక్షలపైగా ఆదాయం ఉంటే రూ. 62 వేల నుంచి రూ. 65 వేలు లోపు చెల్లించాల్సి ఉంటుంది. లేదా 5 లక్షల లోపు ఆదాయం మాత్రమే ఉంటే వారు కేవలం రూ. 20వేల మాత్రమే కట్టాలి. అదే లక్షలోపు ఆదాయం ఉంటే వారికి రిజర్వేషన్ తో సంబంధం ఫీజు మొత్తం ఫ్రీ. అంతే కాకుండా ఎవరైతే ఈ బ్రాంచులో జాయిన్ అయిన టాప్ 5 ర్యాంకు సాధించిన వారు ఉన్నారో వారికి కూడా ఈ ఇనిస్టిట్యూట్లో విద్య పూర్తి ఉచితం. అంతేకాకుండా చదివినప్పుడు 9జీపీఏ కనుకు వస్తే 50శాతం ఫీజు ఉచితం. ఇక్కడ డ్యుయల్ డిగ్రీ మరో ప్రత్యేకం. దీనిలో ఎంఎస్, ఎంటెక్ రెండు బ్రాంచులు ఉంటాయి. వీటిలో అనేక కోర్సులు ఆఫర్స్ చేస్తుంది. ఇకపోతే ఈ ఇనిస్టిట్యూట్లో చదివిన విద్యార్థులకు చాలామందికి వెంటనే ఇస్రోలో ఉద్యోగాలు లభిస్తాయి.
ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? జేఈఈ మెయిన్స్ ని ఎలా ఛేదించాలి, ఎలాంటి కళాశాలల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు.. సివిల్స్ కు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి ఇవే కాక విద్యపరంగా ఎలాంటి ప్రశ్నలు లేదా సూచనలు కావాలన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.