Last Updated:

Education News : వరల్డ్ టాప్ చైనీస్ యూనివర్సిటీ లలో 100% స్కాలర్ షిప్ సాధించడం ఎలా ?

ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. దేశాలను, ఖండాంతరాలను కూడా దాటి విద్యను అభ్యసించడానికి వెళ్ళడం కూడా ఇటీవల గమనించవచ్చు. ఉన్నత చదువుల కోసం విదేశాల్లో కూడా టాప్ యూనివర్సిటీ లలో సీట్లు సాధించాలని.. బాగా కష్టపడుతూ ఉంటారు.

Education News : వరల్డ్ టాప్ చైనీస్ యూనివర్సిటీ లలో 100% స్కాలర్ షిప్ సాధించడం ఎలా ?

Education News : ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. దేశాలను, ఖండాంతరాలను కూడా దాటి విద్యను అభ్యసించడానికి వెళ్ళడం కూడా ఇటీవల గమనించవచ్చు. ఉన్నత చదువుల కోసం విదేశాల్లో కూడా టాప్ యూనివర్సిటీ లలో సీట్లు సాధించాలని.. బాగా కష్టపడుతూ ఉంటారు. నిరంతరం శ్రమించి నాణ్యమైన విద్యను పొందేందుకు ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని రంగాలలో అభివృద్ది చెందుతున్న చైనాలో విద్యా వ్యవస్థ కూడా బలంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న టాప్ 100 యూనివర్సిటీ లలో చైనా లోనే 25 ఉన్నాయంటే.. విద్య పరంగా ఎంత ముందుకు దూసుకుపోతుందో తెలుసుకోవచ్చు. ఈ క్రమం లోనే భారత్ నుంచి విదేశాలకు వెళ్ళి చదవాలి అని అనుకునే విద్యార్ధులకు చైనా ఒక మంచి ఎంపిక అయ్యిందని చెప్పాలి. అయితే టాప్ యూనివర్సిటీ లలో ఫీజులు ఎక్కువగా ఉంటే అని ఆందోళన చెందే విద్యార్ధుల అనుమానాలకు చెక్ పెడుతూ.. 100% స్కాలర్ షిప్ తో ఆయా టాప్ యూనివర్సిటీ లలో ఎలా చదువుకోవచ్చోనని కెరీర్ గైడెన్స్ నిపుణులు డా. సతీష్ వివరిస్తున్నారు. అదే విధంగా చైనా లోని విద్య వ్యవస్థ, ఉద్యోగ అవకాశాల గురించి కూడా పూర్తి విషయాలను తెలియజేస్తున్నారు. మీకోసం ప్రత్యేకంగా..