Home / క్రైమ్
ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన కోడికత్తి హత్యాయత్నం కేసులో నిందుతుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోసం అతని తల్లి నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ నెల 25న తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆమె సమాయత్తమౌతుంది.
భాగ్యనగరంలో ఓ నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ భాగోతం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పలు హోటళ్ల యజమానుల నుండి నెలసరి మామూళ్లను నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ వసూలు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.
రోజుకు ఏదో ఓ మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారిపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె జననాంగాల్లో రాడ్ చొప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకనందా రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చేసింది
విశాఖపట్టణంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఓ లాడ్జీలో శ్రీకాకుళానికి చెందిన ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంగా ప్రేమించుకున్న తమ పెళ్లికి ఎక్కడ పెద్దలు అంగీకరించరోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతంగా కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ నరికేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణ హత్యను చూసిన జనం భయభ్రాంతులకు గురయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటిదినం విచారణ చేయనుంది. ఈ నేపధ్యంలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
కట్టుకున్న భార్యను మరో పర పురుషుడికి పడక సుఖం ఇవ్వాలని ఓ భర్త ఒత్తిడి చేశాడు. అనగా భార్య మార్పిడి క్రీడ (వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని అతడు తన భార్యని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించలేదని ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో ప్రాంతంలో వెలుగు చూసింది.
సీఎం కేసిఆర్ కు మరో షాక్ తగిలింది. తెరాస పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ. 80.65 కోట్ల రూపాయలు విలువైన స్ధిర, చర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఒక్కో రోజు ఒక్కో విధంగా ప్రకంపనలు గుప్పిస్తుంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నేడు సీబీఐ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది.