Home / క్రైమ్
పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
ఒక 12 ఏళ్ల కుర్రాడు తనను పాము కాటేసిందని దానిపై కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును పట్టుకుని తన పంటితో కసితీరా కొరికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన బాలుడు మరణించలేదు కానీ బాలుడు కొరికిన పాము మాత్రం మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనం ద్వారా చూసెయ్యండి.
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
ఉప ఎన్నికకు తరలిస్తూ రూ. 89.91లక్షల నగదు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పట్టుబడింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడి డ్రైవర్ తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బెయిల్ పై మంత్రి నారాయణ ఉన్నారు. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోదుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
గుజరాత్లో మోర్బీలో ఆదివారం నాడు 170ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు.
సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు జంట పేలుళ్ల ఘటన తీవ్ర విషాదాన్ని మరియు భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది మరణించారు. విద్యా మంత్రిత్వ శాఖ భవనం సమీపంలోని రద్దీగా ఉండే జంక్షన్ వద్ద శనివారం నాడు ఈ దాడి చోటుచేసుకుంది.
భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం వెలుగులోకి వచ్చింది. హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం చేసిన స్కాం బట్టబయలయ్యింది. 200కోట్ల కంపెనీ షేర్స్ ను 10మంది కుటుంబ సభ్యులకు ఆ కంపెనీ యాజమాన్యం బదలాయించుకుంది.