Home / క్రైమ్
కైకలూరులో విషాదం చోటుచేసుకొనింది. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైనాయి. బాధితులు ఇరువురు సొంత అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది.
హైదరాబాద్ నగర శివారులో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్కారం గ్రామ పరిధిలోని ఎర్రకుంట చెరువులో పడి 6మంది చనిపోయారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్లో శుక్రవారం అర్ధరాత్రి ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆమ్లెట్ ఇష్టపడివారుండరు అనడంలో అతిశయోక్తి లేరు. శాఖాహారులు సహా మాంసాహారుల వరకు భోజనప్రియులైన వారు ఆమ్లెట్ అంటే లొట్టలేసుకుంటారు. అందులోనూ మందుబాబులైతే స్టఫ్ గా దానిని తెగ ఎంజాయ్ చేస్తారనుకోండి. అయితే నోట్లో వేసుకోగానే అమాంతం జారిపోయే ఈ ఆమ్లెట్ కూడా ప్రాణాలు తీస్తుందని ఎవరికైనా తెలుసా. గుడ్డు ఆమ్లెట్ తిని ఓ వ్యక్తి మరిణించాడు.
అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్లో బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు రూ. 4.1కోట్లు విలువచేసే విదేశీ కరెన్సీ పట్టుబడింది. దీంతో ముగ్గురు ప్రయాణీకులను అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ రోజు తెల్లవారు జామున తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు – కారు ఢీ కొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మహబూబ్ నగర్లో ట్రావెల్ బస్సు బోల్తా పడి 40 మంది గాయపడ్డారు.
నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం పై నగదును తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల తీరు. రేపటిదినం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈ క్రమంలో పోలింగ్ రౌండ్లను ఓవర్ లెక్కన బుకీలు పంచుకొన్నారు.
సమాజంలో రోజు రోజుకు నేరాలు అధికమౌతున్నాయి. సంబంధం లేని వ్యవహారాల్లో కూడా క్షణికావేశాలకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే వైఫై పాస్వర్డ్ చెప్పలేని కారణంగా ఓ బాలుడిని కత్తి పొడిచి చంపిన ఘటన ముంబైలో జరిగింది.