Top 5 Affordable Scooters: బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్స్.. చవక మాత్రమే కాదు.. గొప్ప మైలేజ్ కూడా..!

Top 5 Affordable Scooters: దేశంలో అత్యధికంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. వీరికి రోజువారీ వినియోగానికి ద్విచక్ర వాహనాలు చాలా అవసరం. ముఖ్యంగా స్కూటర్ మహిళలు, పురుషులు ఇద్దరికీ మరింత అనుకూలంగా ఉంటుంది. దీని సహాయంతో, మీరు ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లవచ్చు, మీ పిల్లలను సులభంగా పాఠశాలకు వదిలివేయవచ్చు, కిరాణా సామాను పొందడానికి మార్కెట్ లేదా కిరాణా దుకాణానికి వెళ్లవచ్చు. మీరు కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా.. గరిష్ట మైలేజ్, తక్కువ ధర కలిగిన టాప్- 5 స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. Hero Pleasure Plus
ముందుగా హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. దీని కనిష్ట ధర రూ.72,713 లక్షలు, గరిష్ట ధర రూ.84,843 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ 110 cc పెట్రోల్ ఇంజన్‌తో 8.1పిఎస్ హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 50 kmpl మైలేజీని కూడా ఇస్తుంది. కొత్త హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ పెర్ల్ సిల్వర్ వైట్, బ్లూయిష్ టీల్, అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ, మ్యాట్ వెర్నియర్ గ్రే వంటి వివిధ రంగుల ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. ఇది LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LCD స్క్రీన్‌తో సహా అనేక ఫీచర్లను పొందుతుంది. భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇందులో 4.8 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఉంది.
2. Suzuki Avenis 125
సుజుకి అవెనిస్ 125 విషయానికొస్తే, స్కూటర్ ధర రూ. 95,581 లక్షల నుండి రూ. 96,383 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 124.3 cc ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 8.7 పిఎస్ హార్స్ పవర్, 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 55 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ 125 స్కూటర్‌లో LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, USB ఛార్జింగ్ పోర్ట్, ఫుల్ డిజిటల్ LCD క్లస్టర్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. రైడర్ రక్షణ కోసం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కొత్త స్కూటర్ బరువు 106 కిలోలు, 5.2 లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది.
3. TVS Jupiter
టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ విషయానికొస్తే, దీని ధర కనిష్టంగా రూ.78,391. గరిష్టంగా రూ.92,366 (ఎక్స్-షోరూమ్). ఇది 113 cc పెట్రోల్ ఇంజన్‌తో 48 kmpl మైలేజీని అందిస్తుంది. ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్, డిజిటల్-ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
4. Honda Activa
హోండా యాక్టివా 110 కూడా ప్రముఖ స్కూటర్. దీని ధర రూ.81,625 నుంచి రూ. 86,625 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఇందులో 109.51 సిసి పెట్రోల్ ఇంజన్ కలదు. 59.5 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో సహా పలు ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌లు అందించారు.
5. Suzuki Access 125
సుజుకి యాక్సెస్ 125 గురించి చెప్పాలంటే, ఈ స్కూటర్ ధర రూ.85,283 నుంచి రూ.96,881 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. దీనిలో 47.5 kmpl మైలేజీని అందించే 125 cc పెట్రోల్ ఇంజన్ ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో సహా డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెరల్ గ్రే వైట్ కలర్స్‌లో కూడా అందుబాటులో ఉంది.