Last Updated:

Tata Punch: పడిపోతున్న అమ్మకాలు.. మూడో స్థానానికి పడిపోయిన టాటా పంచ్.. ఎందుకంటే..?

Tata Punch: పడిపోతున్న అమ్మకాలు.. మూడో స్థానానికి పడిపోయిన టాటా పంచ్.. ఎందుకంటే..?

Tata Punch: టాటా పంచ్ ఒక ప్రసిద్ధ మైక్రో ఎస్‌యూవీ. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో అమ్ముడవుతుంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో విక్రయించిన ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితాలో ‘పంచ్’ కూడా నాలుగో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ‘మారుతి సుజుకి ఫ్రాంక్స్’ కారు నిలిచింది.

గత నెల ఫిబ్రవరిలో టాటా మోటార్స్ ‘పంచ్’ ఎస్‌యూవీని 14,559 యూనిట్లను విజయవంతంగా విక్రయించింది. 2024లో ఇదే నెలలో 18,438 యూనిట్లు అమ్ముడయ్యాయి. పోల్చి చూస్తే, అమ్మకాల పరిమాణం సంవత్సరానికి -21శాతం తగ్గింది (YoY). అయితే, విక్రయాల గణాంకాలు తగ్గడానికి గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. జనవరిలో 16,231 యూనిట్ల టాటా పంచ్ కార్లు విక్రయించింది. 2024 ద్వితీయార్థంలో కూడా, ఈ SUVలు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. డిసెంబర్‌లో 15,073 యూనిట్లు, నవంబర్‌లో 15,435 యూనిట్లు, అక్టోబర్‌లో 15,740 యూనిట్లు, సెప్టెంబర్‌లో 13,711 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Tata Punch Features
ఈ కారు ధర రూ.6.20 లక్షల నుంచి మొదలై, రూ.10.32 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ న్చాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్లు ఉన్నాయి. 5-స్పీడ్ మ్యాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అందించారు. ఇది 18.8 నుండి 26.99 kmpl మైలేజీని అందిస్తుంది. ఇందులో 5-సీట్లు ఉన్నాయి, కాబట్టి ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించచ్చు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, అరుదైన AC వెంట్లు, సన్‌రూఫ్ ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించారు.

టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 14.29 లక్షల మధ్య ఉంటుంది. 25 కిలోవాట్, 35 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంది, పూర్తి ఛార్జ్‌పై 265 నుండి 365 కిమీల పరిధి (మైలేజీ)ని అందిస్తాయి. ఇందులో 5 మంది ప్రయాణించవచ్చు. కారులో ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ డిస్‌ప్లేలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాను చూడచ్చు.