Last Updated:

Maruti Suzuki Offers: రండి బాబూ రండి.. కారు కొనండి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు..!

Maruti Suzuki Offers: రండి బాబూ రండి.. కారు కొనండి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు..!

Maruti Suzuki Offers: మీరు కొత్త కారు కొనాలంటే ఈ నెలాఖరులోపు కొనడం మంచిది. ఈ నెలలో మారుతీ సుజుకి తన కార్లపై చాలా మంచి తగ్గింపులను అందిస్తోంది. Alto K10 నుండి Wagon-R వరకు ఈ నెలలో పెద్ద మొత్తంలో పొదుపు చేయచ్చు. తాజా సమాచారం ప్రకారం.. మారుతి సుజుకి తన డీలర్‌షిప్‌ల వద్ద 2024/2025 సంవత్సరానికి పాత స్టాక్‌ను క్లియర్ చేస్తోంది, అందుకే డిస్కౌంట్లను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, కంపెనీ కార్ల ధరలను వచ్చే నెల నుండి పెరగునున్నాయి. కాబట్టి ఈ నెలలో కారు కొనడం ద్వారా ఎంత ఆదా చేస్తారు? కార్లలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Alto K10
ఆల్టో K10 భారతదేశంలో అత్యంత చౌకైన కారు, అయితే ఈ నెలలో ఇది మరింత సరసమైనదిగా లభిస్తోంది. ఈ కారుపై రూ.83,100 వరకు తగ్గింపు ఇస్తోంది. ఇందులో నగదు తగ్గింపు, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు ధర రూ. 4.23 లక్షల నుంచి ఈ కారులో 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. మీరు దీన్ని CNGలో కూడా కొనుగోలు చేయచ్చు. ఈ కారులో సామాను నిల్వ చేయడానికి మంచి బూట్ స్పేస్ కూడా ఉంది. భద్రత కోసం, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD ఉంది.

Maruti Suzuki Swift
మీరు ఈ నెలలో మారుతీ సుజుకి స్విఫ్ట్ కారు కొనడానికి వెళితే, మీకు రూ.58100 వరకు తగ్గింపు లభిస్తుంది. నగదు తగ్గింపు, స్క్రాపేజ్ బోనస్ , కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ఈ కారు ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాని బూట్‌లో మంచి స్థలం ఉంది. సామాను ఉంచడానికి చాలా స్థలం ఉంది. భద్రత కోసం, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD ఉంది. ఈ కారులో 1.2L పెట్రోల్ ఇంజన్ ఉంది.

Maruti Suzuki Wagon R
మీరు ఈ నెలలో వ్యాగన్ ఆర్ కొనుగోలు చేయడం ద్వారా రూ. 73,100 వరకు ఆదా చేసుకోవచ్చు. వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.54 లక్షల నుండి రూ.7.25 లక్షల వరకు ఉంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం డీలర్‌ను సంప్రదించండి. ఇంజన్ గురించి మాట్లాడితే వ్యాగన్-ఆర్‌లో రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇందులో 1.0లీ, 1.2లీ పెట్రోల్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు వ్యాగన్-ఆర్‌లో CNG ఎంపికను కూడా పొందుతారు. ఈ కారు CNGలో 34.04 km/kg మైలేజీని ఇస్తుంది. ఇందులో ఆటోమేటిక్, మాన్యువల్ అనే రెండు ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి. వ్యాగన్-ఆర్‌లో మంచి బూట్ స్పేస్ కూడా ఉంది. భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD ఉంది.