Home /Author
తండ్రి మాట కోసం సింహాసనాన్ని సైతం వదులుకున్నవాడు.. ఏకపత్నీవ్రతుడు.. సోదరులకు ఆదర్శప్రాయుడు .. పాలన అంటే రామరాజ్యంలావుండాలి. ఇవీ శ్రీరాముని గురించి ప్రపంచానికి తెలిసిన విషయం. అంతేకాదు తన శరణు జొచ్చిన వారిని , తన భక్తులను కూడ కాపాడటంలో శ్రీరాముడు ముందుంటాడు.
ఏపీ సీఎం జగన్ ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడె మోసారు.
తాను కాంట్రాక్ట్‌ల కోసం అమ్ముడుపోయానని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, వాటిని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిరూపించకుంటే రేవంత్ రెడ్డి పీసీసీకి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని ఓపెన్ చాలెంజ్ చేశారు.
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్‌పై బ్లేడ్‌తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్‌పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్ఐపై బ్లేడ్‌తో దుండగుల దాడికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకై అస్వస్థకు గురైన బాధితులు కోలుకుంటున్నారన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు.
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది.
సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేషనల్ హెరాల్డ్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ పేపర్‌తో పాటు మొత్తం 12 లొకేషన్లలో సోదాలు మొదలుపెట్టింది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఐదో రోజు భారత్ అదరగొట్టింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.
దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.