Home /Author
భారతదేశంలోని కోల్‌కతాలో పుట్టి, యూరప్‌లో పెరిగిన 27 ఏళ్ల అంగనా మహేశ్వరి తన వెంచర్, వేగానోలజీ ద్వారా రీసైకిల్ ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించి బ్యాగులను తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ వర్షాకాలంలో భారతదేశంలో వీటి తయారీని ప్రారంభించాలని భావిస్తున్నారు. ' తోలు పరిశ్రమ సృష్టించిన పర్యావరణ సమస్యలను దృష్టిలో వుంచుకుని వీటిని తయారు చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.
వాట్సాప్ ప్రస్తుతం పలు ఫీచర్లపై పనిచేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం వాట్సాప్ లాగిన్ ఆప్రూవల్ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను కలిగి ఉంది. ఎవరైనా మరొక పరికరంలో వారి ఖాతాకు లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు లాగిన్ అప్రూవల్ యూజర్లకు వాట్సాప్ యాప్‌లో హెచ్చరికను పంపుతుంది.
శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి.
బీహార్‌లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు.
బ్రిటన్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుందని లేఖలో వివరించారు. అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుట
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు.
మనదేశంలో సాగుచేసే పంటల్లో నువ్వులు ఒకటి. ఈ నువ్వులు మన ఆహారంలో తీసుకుంటే అటు రుచికరంగా ఉండటమే కాకుండా ఇటు ఆరోగ్యాన్ని కూడ కాపాడుకోవచ్చు. నువ్వులు సాధారణంగా తెలుపు మరియు నలుపురంగులో వుంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా ఆమ్లాలు వుంటాయి.
కాఫీ మరియు టీలను ఇష్టపడే చాలా మంది ప్రజలు క్రమంగా కెఫిన్ వ్యసనానికి గురవుతారు. టీ మరియు కాఫీ వంటి పానీయాలలో ఉండే కెఫిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.శక్తివంతం చేస్తుంది. అయినప్పటికీ, కెఫిన్ యొక్క అధిక వినియోగం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.