Last Updated:

BJP-JDU: బీహార్‌లో జేడీయూ-బీజేపీ పొత్తు పై నీలినీడలు

బీహార్‌లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని

BJP-JDU: బీహార్‌లో జేడీయూ-బీజేపీ పొత్తు పై నీలినీడలు

Bihar: బీహార్‌లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని “బహిరంగంగా ఉల్లంఘించారని” ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సిన్హా కూడా ‘రాజ్యాంగ విరుద్ధం’ గా సభను నడపబోతే. లఖిసరాయ్‌కు సంబంధించిన సమస్య పై ప్రశ్నలను లేవనెత్తిన స్పీకర్ మరియు అతని మిత్రపక్షం బిజెపిపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేసారు.

జూలై 17న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి నితీష్ కుమార్ మిస్సయ్యారు. జులై 22న పదవీవిరమణ చేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు బీహార్ సీఎం మిస్ అయ్యారు. 2017లో మహాఘట్‌బంధన్‌లో భాగమైనప్పుడు కూడా జేడీయూ కోవింద్ అభ్యర్థిత్వాన్ని సమర్థించిన నేపథ్యంలో ఇది జరిగింది. అంతేకాకుండా, జూలై 25న ఢిల్లీలో జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అతను హాజరు కాలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఆమెకు ఓటు వేశారు. తాజాగా ఆగస్టు 7న (ఆదివారం) జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశానికి నితీష్ కుమార్ గైర్హాజరు కావడం కూడా స్పష్టంగా కనిపించింది. పంటల వైవిధ్యం, జాతీయ అమలు వంటి కీలక అంశాలు విద్యా విధానం, పట్టణ పాలన పై చర్చించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మమతా బెనర్జీ, అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు.

కుల గణన అంశం పై చర్చించేందుకు జేడీయూ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరితో ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు పాట్నాలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశమవుతున్నారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడినట్లు కూడా సమాచారం. 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నితీష్ పార్టీ పెద్ద సంఖ్యలో సీట్లు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. లాలూప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ. సీట్ల సంఖ్యను లెక్కిస్తే లాలూ-నితీష్‌, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని సులువుగా ఏర్పాటు చేస్తారు. అదే జరిగితే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ హిందీ బెల్ట్‌లోని ఒక ముఖ్యమైన రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవలసి వుంటుంది. మరి మోదీ- షాలు దీన్ని ఏలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి.

ఇవి కూడా చదవండి: