Home /Author
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సీతా రామం చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది. దీనితో ఈ చిత్రం మొత్తం వీకెండ్ లో రూ.24.20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రూ.6,148 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, ఇది రూ.3,214 కోట్ల లాభాలు రావడం గమనార్హం.
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మరియు వీ (గతంలో వోడాఫోన్-ఐడియా) వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ 5G సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దమవుతున్నారు..సెప్టెంబర్ 29 న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 5G నెట్‌వర్క్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
కళ్లు తిరగడం, తలతిరగడం మరియు మందకొడిగా మాట్లాడటం వంటి లక్షణాలు వున్నట్లయితే మీరు ఆల్కహాల్ ను మోతాదుకు మించి తీసుకుంటున్నట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్కహాల్ ఎంత పరిణామంలో తాగితే ఎటువంటి ఫలితాలు సంబవిస్తాయనేది పలు రకాల అంశాలపై ఆధారపడివున్నాయి.
సాధారణంగా మనం పాలతో రకరకాల తీపి పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాం. పాలతో చేసే తీపి పదార్థాలలో పాలకోవా ఒకటి. పాలకోవా చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. చాలా తక్కువ సమయంలో పాలకోవాను మనం పాలపొడితో తయారు చేసుకోవచ్చు. పాల పొడితో చేసిన ఈ పాలకోవా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాలపొడితో ఎంతో రుచిగా ఉండే పాలకోవాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్ధా చటర్జీ లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు విద్యశాఖలోని ప్రతి పోస్టుకు ఒక్కొ ధర నిర్ణయించి అందిన కాడికి డబ్బు దండుకున్నాడు పార్ధుడు. ఎలాంటి అనుభవం లేని వారిని కనీస అర్హత లేని వారిని కూడా డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు పార్ధ చటర్జీ. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న ఆయన తాను అమాయకుడినని తనకు ఏమీ తెలియదని.. కాలమే అని నిర్ణయిస్తుందని అమయకత్వం నటిస్తున్నాడు.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎంపీలు పార్లమెంట్‌కు క్యూ కట్టారు. ప్రధాని మోదీ.. సహా ఎంపీలు అంతా తమ ఓటును వినియోగించుకున్నారు. సభలో 8 ఖాళీ స్థానాలు సహా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.
అస్సాం ప్రభుత్వం తేయాకుతోటల భూమిలో ఐదు శాతం వరకు పర్యావరణ అనుకూల టీ టూరిజం, గ్రీన్ పవర్ మరియు పశుపోషణకు ఉపయోగించేందుకు అనుమతించింది.ఒక ఆర్డినెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం అస్సాం ల్యాండ్ హోల్డింగ్ చట్టం 1956పై సీలింగ్‌ను సవరించింది.
మంచి అంచనాలతో విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా హైప్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. గత 2 నెలలలుగా కళ తప్పిన బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. బింబిసార మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి 6.3 కోట్ల షేర్ వసూలు చేసింది.