Home /Author Mallikanti Veerabhadram
South Coast Railway: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ కేంద్రంగా ఏపీకి రైల్వేజోన్ ను కేంద్రం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు డివిజన్ ను కలిపి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా రైల్వే జోన్ పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కోస్ట్ రైల్వే […]
Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీలు కుదిరినప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇక నుంచి ఆ పంథా మార్చుకోనుంది. ఇక మీదట ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మొదటి, మూడో శనివారం కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా పథకాలు, అభివృద్ధిపై మంత్రివర్గం క్రమం తప్పకుండా సమీక్షలు చేయనుంది. […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ క్రమంగా తన పంజా విసురుతోంది. రోజురోజుకు యాక్టీవ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటిపోయింది. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా నిన్న ఉదయం 8 […]
RBI Review: ద్రవ్య పరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతమున్న రెపోరెటు 6 నుంచి 5.5 శాతానికి తగ్గనుంది. కాగా వరుసగా మూడోసారి ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో వాహన, గృహ, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. ఇక వడ్డీ రేట్ల తగ్గింపుతో […]
Hydra Demolish: అక్రమ కట్టడాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే నాళాలను ఆక్రమించి భవనాలు నిర్మించారని.. హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు వాటిని పరిశీలించి కూల్చివేతలు చేపట్టారు. అక్రమాలు ఎంతమేర చేపట్టారో గమనించి జేసీబీలతో వాటిని కూల్చివేస్తున్నారు. కాగా ఇవాళ బేగంపేట, ప్యాట్నీ ఏరియాల్లోని నాళాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. కంటోన్మెంట్ ఏరియాలో తొలిసారిగా అక్రమ కట్టాడాలు కూల్చివేయడం గమనార్హం. కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి హైడ్రా […]
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, భారత్ లో మొట్టమొదటి కేబుల్- స్టేడ్ రైలు వంతెనను ప్రధాని మోదీ జాతీకి అంకితం చేయనున్నారు. అలాగే కత్రాలో రూ. 46 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే చీనాబ్ రైల్వే వంతెన మీదుగా పరుగులు […]
Yadadri Bhuvanagiri: సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. బహిరంగ సభ అనంతరం సీఎం […]
Telangana Government: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఏటా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 6 నుంచి జూన్ 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థులను బడిలో చేర్పించేలా కార్యచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు టీచర్లు బాలకార్మికులను, బడి బయట పిల్లలను, అనాథలను, అంగన్వాడీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రీప్రైమరీ స్కూల్స్, నోట్ బుక్స్ పంపిణీ […]
police Officials Suspended: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆర్సీబీ జట్టు విజయోత్సవాల్లో జరిగిన ఘటనతో అధికారులపై చర్యలు తీసుకుంది. పలువురు పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా సస్పెండ్ అయిన వారిలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్ తో పాటు మరో […]
England First Test Match Team: త్వరలోనే టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ దాదాపు నెలన్నర పాటు జరిగే దీర్ఘకాల టెస్ట్ సిరీస్ లో ఐదు మ్యాచ్ లు ఆడనుంది. కాగా ఈ సిరీస్ తోనే 2025-2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. కాగా ఇంగ్లాండ్ లో పర్యటించే జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకు టెస్ట్ కెప్టెన్ గా […]