Published On:

Shubhanshu Shukla: నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla: నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా

Axiom 4 Mission Launches Today: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు అంతా సిద్ధమైంది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12.01 గంటలకు ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లనున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ లోని లాంచ్ కాంప్లెక్స్ నుంచి ప్రయోగాన్ని చేపట్టనున్నారు. అంతరిక్షయాత్రకు వెళ్తున్న రెండో భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా పేరుగాంచారు. 1984 లో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్రకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నాసా, ఇస్రో, పలు దేశాల అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి.

ప్రయోగం చేపట్టిన 28 గంటల అనంతరం వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు అక్కడే పరిశోధనలు చేయనుంది. కాగా ఈ యాత్ర విజయవంతం కావాలని అంతా కోరుకుంటున్నారు. కాగా ఇప్పటికే పలుమార్లు రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ కారణాలతో రాకెట్ ప్రయోగం నిలిచిపోయింది. తాజాగా ఇవాళ ముహూర్తం ఖరారైంది.

ఇవి కూడా చదవండి: