Published On:

Shubhanshu Shukla: నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్

Shubhanshu Shukla: నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్

Axiom 4 Mission:భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. ఆక్సియం- 4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు ప్రయోగం మొదలైంది. 28 గంటల ప్రయాణం అనంతరం రేపు సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంతో కనెక్ట్ అవనున్నారు. 14 రోజులు వీరు అంతరిక్షంలో పలు పరిశోధనలు చేయనున్నారు.

 

అమెరికాలోని ప్రేవేట్ స్పేస్ సంస్థ ఆక్సియం చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఏఎక్స్- 4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా రోదసిలోకి వెళ్లారు. ప్రైవేట్ సంస్థ స్పేస్ మిషన్ లో అంతరిక్షానికి వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించారు. వ్యోమనౌకలోకి వెళ్లే ముందు శుభాంశు తనకి ఎంతో ఇష్టమైన పాటను విన్నారు. హృతిక్ రోషన్ హీరోగా విడుదలైన ఫైటర్ మూవీలోని వందేమాతరం పాటను ఎంతో ఇష్టంగా విన్నారు.

 

 

 

ఇవి కూడా చదవండి: