Home /Author Jyothi Gummadidala
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. కాగా మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు.
మెగాస్టార్ చిరంజీవిని మరో అరుదైన అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని చిరు కౌవసం చేసుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.
ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు.
హైదరాబాద్లో నిర్వహించిన వైఎన్ఎం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాల నుంచి ఆయన వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
విశాఖ ప్రైవేటీకరణపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేశం, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు బలంగా ఉండాలని తద్వారా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తిప్పి కొట్టవచ్చని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం జరిగే ఉద్యమంలో ఒకొక్కరు కాకుండా కుటుంబ సమేతంగా లేదా మూకుమ్మడిగా వందలు వేలాది మంది తరలిరావడం ద్వారానే మన ఉక్కుపరిశ్రమను మనం కాపాడుకోగలమని ఆయన తెలిపారు.
హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరయ్యారు. కాగా ఈ నేపథ్యంలో మిగిలిన 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో నేతలు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
శీతాకాలం వచ్చిందంటే చాలు చలి వల్ల చాలామంది పలు రోగాల బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులు వాడుతున్నా సరే చాలా కాలం పాటు వదలదీ జలుబు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఆవిరి పట్టడం అన్నిట్లోకి మెరుగైన పద్ధతని ఆవిరి పట్టే ముందు ఆ నీటిలో నాలుగు రకాల పదార్థాలను వేస్తే మరింత తొందరగా జలుబును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. నేడు తను ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది.