Home /Author anantharao b
జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) హైదరాబాద్, హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ విద్యానగర్‌లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. డాక్టర్ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎపుడూ లేనివిధంగా ఒక భక్తుడు సేవలందించడంలో జాప్యం జరుగుతోందంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనితో కోర్టు అతనికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం ముంబై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ సంస్దల మాజీ చైర్మన్ మిస్త్రీ మరణించిని విషయం తెలిసిందే. కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా, మిస్త్రీ సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలమయింది. ప్రజలను ఖాళీ చేయడానికి తెప్పలను పంపమని అధికారులను ప్రేరేపించారు. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు బిఈఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా వరదనీటిలో చిక్కుకున్నాయి.
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దానాపూర్ సమీపంలో గంగానదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
చంద్రుడికి పైకి నాసా ప్రయోగించ తలపెట్టిన మానవ రహిత ఆర్టెమిస్ ఉపగ్రహ ప్రయోగం మరోమారు వాయిదా పడింది. అర్టెమిస్‌ను మోసుకెళ్లే ఉపగ్రహ వాహక నౌక స్పేస్‌లాంచ్ సిస్టమ్ లో ఇంధనం నింపుతుండగా లీక్ సమస్య ఎదురైంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత షెడ్యూల్ ఖరారైంది. 10 రోజులపాటు 9 నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర 10 రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాన్ని బలహీన పరిచారని ఫైరయ్యారు.