Cyrus Mistry: అతివేగం, సీటు బెల్ట్ ధరించకపోవడం.. మిస్త్రీ మరణానికి కారణాలు
ఆదివారం ముంబై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ సంస్దల మాజీ చైర్మన్ మిస్త్రీ మరణించిని విషయం తెలిసిందే. కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా, మిస్త్రీ సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
Mumbai: ఆదివారం ముంబై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ సంస్దల మాజీ చైర్మన్ మిస్త్రీ మరణించిని విషయం తెలిసిందే. కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా, మిస్త్రీ సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, సీటు బెల్టులు ధరించకపోవడమే వారిప్రాణాలను బలిగొన్నాయని తెలుస్తోంది.
ముంబైకి 120 కి.మీ దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని చరోటి చెక్ పోస్ట్ దాటిన తర్వాత కేవలం 9 నిమిషాల్లో 20 కి.మీ. సూర్య నదిపై వంతెన పై ఉన్న రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో మిస్త్రీ (54), జహంగీర్ పండోల్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సీటు బెల్ట్ ధరించలేదు. మిస్త్రీ అహ్మదాబాద్ నుండి ముంబైకి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ విషాదం చోటుచేసుకుంది. కారును ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహిత పండోల్ (55) నడిపారు. ఈ ప్రమాదంలో ఆమె, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
టాటా సన్స్‌కు ఆరో ఛైర్మన్‌గా ఉన్న మిస్త్రీని అక్టోబర్ 2016లో పదవి నుంచి తొలగించారు. రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత డిసెంబర్ 2012లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.