Home /Author anantharao b
తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆమె విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.
టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష పై అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు కేసు నమోదు చేసారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.
పరాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్త పై క్షణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
పోలీసులు దొంగలను లేదా ఇతరులను కొట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో మద్యం మత్తులో ఉన్న పోలీసు కానిస్టేబుల్ హోంగార్డును కొట్టిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో చేరి వారి చదువును పూర్తి చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జాతీయవైద్యమండలి ఉక్రెయిన్ అందించే అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ను గుర్తించడానికి అంగీకరించింది.
కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉమేష్ బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలోని టాయిలెట్లో కుప్పకూలిపోయాడు.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు కన్యాకుమారి నుంచి పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించనున్నారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర దాదాపు 150 రోజుల్లో పూర్తి కానుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్‌విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మంగళవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నీటి భాగస్వామ్యం, రైల్వేలు, సైన్స్, వాణిజ్యం మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యల పై ఏడు అవగాహన ఒప్పందాల (ఎంఒయులు) పై సంతకం చేశాయి.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇవాళ రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత షేక్ హసీనా మాట్లాడారు. భారత్ తమకు మంచి ఫ్రెండ్ అని, ఇండియాకు వచ్చిన ప్రతిసారి సంతోషంగా ఫీలవుతానని, విముక్తి పోరాట సమయంలో ఇండియా ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమన్నారు.