Home /Author anantharao b
కెనడా కేంద్రంగా రోజురోజుకీ విస్తరిస్తున్న ఖలిస్థాన్ భావన దౌత్యపరమైన ఉద్రిక్తతలని రెచ్చగొడుతోంది. కెనడా.. భారత దేశాలు దౌత్యవేత్తలని బహిష్కరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది.
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలన్నది తన కల అని చెప్పారు. ఈ సందర్బంగా సోనియాగాంధీ తెలంగాణకు ఆరు గ్యారంటీ పధకాలను ప్రకటించారు. అవి
విశ్వకర్మ జయంతి సందర్భంగా కళాకారులు మరియు హస్తకళాకారులు మరియు సాంప్రదాయ నైపుణ్యాలలో నిమగ్నమైన వారికి సహాయం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ "పిఎం విశ్వకర్మ" అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు.
ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల విజయ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ చేధించింది.
భారతీయ-అమెరికన్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఒప్పంద సేవగా పేర్కొన్నారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గగెలిస్తే లాటరీ ఆధారిత వ్యవస్థను రద్దు చేస్తానని దాని స్దానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తీసుకు వస్తానని తెలిపారు.
బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో తుఫాను వాతావరణంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానంకూలిపోవడంతో శనివారం పద్నాలుగు మంది మరణించారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిమీ (248 మైళ్లు) దూరంలో ఉన్న బార్సెలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐఐసిసి) యశోభూమి మొదటి దశను ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుండి కొత్త మెట్రో స్టేషన్ యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ.. భారత్ లో అంతర్భాగమయిందని సీఎం కేసీఆర్ అన్నారు. అమర వీరులకు నివాళులు అర్పించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరులకు ముందుగా వందనం చేశారు. రజాకార్లపై పోరాడి అమరులయిన వారికి నివాళులు అర్పించారు.
జమ్ముకశ్మీర్ ఎన్ కౌంటర్లో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు.