Home /Author anantharao b
జమ్మూలోని రాంబన్ జిల్లాలోని బనిహాల్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు 30 కిలోల హై-గ్రేడ్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కశ్మీర్ నుంచిపంజాబ్కు వెళ్లే మార్గంలో ఇన్నోవా కారులో దీనిని తరలిస్తున్నారు. ఈ సందర్బంగా ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న వేళ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోస్టర్లు, ఫ్లెక్సీల యుద్ధానికి తెరలేచింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పోస్టర్లు, బ్యానర్లని ఏర్పాటు చేసింది. అలాగే మోదీ తెలంగాణని ప్రతిసారి కించపరుస్తున్నారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
నేడు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఒంటిగంట 35 నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు పాలమూరుకు చేరుకుంటారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన సమన్వయకర్తలను కూడా నియమించింది.
లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే పోక్సో (POCSO) చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సును తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ లా కమిషన్ తన అభిప్రాయాలను తెలియజేసింది. లా కమిషన్ శుక్రవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో, సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దని సూచించింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యాటక ప్రదేశాలలో ఒకటైన వెనిస్ పర్యాటకులకు ప్రవేశ రుసుమును విధించే ప్రణాళికను ప్రకటించింది. యునెస్కో హెచ్చరికల నేపధ్యంలో పర్యాటకులను తగ్గించడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదన వచ్చింది. యునెస్కో వెనిస్ ను ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చనున్నట్లు తెలిపింది.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రపతి గురువారం ఆమెకు ఆమోదం తెలిపారు.
విశాఖ ఇండస్ట్రీకు ఆరు వారాల్లోపు 17కోట్ల 50 లక్షలు చెల్లించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కి హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి 2004లో బ్యాంకు లోన్ తెచ్చి విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్షిప్ చేసింది. ఆ తరువాత హెచ్‌సీఏ - విశాఖ ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్‌ను హెచ్‌సీఏ క్యాన్సిల్ చేసింది.
ఐసీసీ వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. విమానాశ్రయం వెలుపల గుమిగూడిన అభిమానుల స్వాగతాన్ని చూసి పాక్ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. గ్రాండ్ రిసెప్షన్ తరువాత, పాకిస్తానీ ఆటగాళ్ళు తమ సోషల్ మీడియాలో అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.