పవన్ కళ్యాణ్ లో ‘ఓజీ’ లో శ్రియా రెడ్డికి ఛాన్స్
పవన్ కళ్యాణ్ లో ‘ఓజీ’ లో శ్రియా రెడ్డికి ఛాన్స్ Sriya Reddy joins the cast of Pawan Kalyan's OG

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ లో శ్రియా రెడ్డి
కీ రోల్ చేయనుంది.

శ్రియా రెడ్డికి వెల్ కం చెబుతూ ‘ఓజీ’ మూవి యూనిట్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టింది.

తమిళనాడులో వీజేగా పేరు తెచ్చుకున్న శ్రియారెడ్డి.. విక్రమ్ ‘సమురాయ్’తో ఎంట్రీ ఇచ్చింది.

Fill in some text
విశాల్ హీరో గా వచ్చిన ‘పొగరు’సినిమాతో శ్రియా రెడ్డికి మంచి పేరు వచ్చింది.

ఈ మధ్య ‘సుడల్ ’ అనే వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించింది శ్రియా రెడ్డి. ఈ సిరీస్ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ భామ ప్రభాస్ ‘సలార్’ మూవీలో కూడా కీ రోల్ చేస్తోంది. ఇప్పుడు పవన్ ‘ఓజీ’లోనూ మెరవనుంది.

తెలుగులో ‘అప్పుడప్పుడు’, ‘అమ్మ చెప్పింది’, ‘పొగరు’, లు చేసింది.

శ్రియా రెడ్డి నిర్మాత గా మారి విశాల్ హీరోగా రెండు చిత్రాలు నిర్మించింది.

శ్రియా రెడ్డి హీరో విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఓజీ స్టోరీ చెప్పిన నిమిషాల్లోనే ఈ చిత్రాన్ని ఓకే చెప్పినట్టు శ్రియా రెడ్డి తెలిపింది.
