Last Updated:

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. మరోసారి విజేతగా హైదరాబాద్‌

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. మరోసారి  విజేతగా హైదరాబాద్‌

Vijay Hazare Trophy hyderabad team win: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ విజేతగా మరోసారి హైదరాబాద్‌ జట్టు నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్‌.. శనివారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిలింద్, తనయ్ త్యాగరాజన్ 5, 3 చొప్పున వికెట్లు తీసుకోవటంతో పుదుచ్చేరి 31.5 ఓవర్లకు 98 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సంతోష్ రత్నపార్ఖే (26), ఆమన్ ఖాన్ (14) పరిమిత స్కోరుకే ఔట్ కావటంతో ఈ స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్‌ 6 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో ఛేదించింది.

లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌ జట్టులోని తన్మయ్ అగర్వాల్ (0), పి నితీశ్ రెడ్డి (5), కెప్టెన్ తిలక్ వర్మ (6), కె నితీశ్‌ రెడ్డి (0) పెవిలియన్‌కు క్యూ కట్టినా, ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన కొడిమెల హిమతేజ (42), తనయ్ త్యాగరాజన్ (22) ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది జట్టును విజయం దిశగా నడిపించారు.