Last Updated:

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం .. గోల్డెన్ వీసా మంజూరు చేసిన యూఏఈ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని చిరంజీవికి కూడా అందించింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి  అరుదైన గౌరవం .. గోల్డెన్ వీసా మంజూరు చేసిన యూఏఈ

Megastar Chiranjeevi: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని చిరంజీవికి కూడా అందించింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ వీసా అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మెగాస్టార్ కూడా చేరారు. రజనీకాంత్, షారుక్‌ ఖాన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి పలువురికీ ఇప్పటికీ ఈ వీసా దక్కింది. పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను ఇస్తూ ఉంటుంది.దీనికి సంబంధించి పలువురు ప్రముఖులు ,మెగా అభిమానులు చిరంజీవికి అభినందనలు తెలియచేస్తున్నారు .

‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌తో బిజీగా..(Megastar Chiranjeevi)

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.సుమారు రూ.200 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో చిరు సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు సినిమాకే హైలెట్ అవుతాయని డైరెక్ట్ వశిష్ట భావిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరిస్తున్నారు. ఓ సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం సృష్టించినట్లుగా డైరెక్టర్ వశిష్ట చెప్పారు. వీఎఫ్ఎక్స్‌కి ఈ చిత్రంలో చాలా స్కోప్ ఉందని.. ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి విశ్వంభర ప్రత్యేకంగా అనిపిస్తుందని ధీమాగా ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి: