Last Updated:

Plane Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలు.. కారణం ఏంటంటే?

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో రక్షణశాఖకు చెందిన రెండు యుద్ధ విమానాలు, ఓ ఫైటర్ జెట్ కుప్పకూలడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.దీంతో పాటు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

Plane Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలు.. కారణం ఏంటంటే?

Plane Crash: రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో రక్షణశాఖకు చెందిన రెండు యుద్ధ విమానాలు, ఓ ఫైటర్ జెట్ కుప్పకూలడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పింగోరా రైల్వే స్టేషన్ సమీపంలో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయింది.

ఈ రెండు ఘటనలకు సంబంధించి సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

మధ్యప్రదేశ్ లో సుఖోయ్-30, మిరాజ్ 200 విమానాలు మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో కుప్పకూలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

సంబంధిత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయం చర్యలు చేపట్టాయి.

 

 

యుద్ద విమానాల ప్రమాదానికి (Plane Crash) కారణం ఏంటంటే..?

ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి ఈ  రెండు యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకున్నాయి.

అనంతరం మధ్యప్రదేశ్ లోని మెరెనా సమీపంలో కుప్పకూలగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

కాగా సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణమా? అనే విషయం తెలియాల్సి ఉంది.

గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి యుద్ధ విమానాల విన్యాసాలు జరుగుతుండగా.. మొరెనా సమీపంలో సుఖోయ్‌-30, మిరాజ్‌ విమానాలు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి.

శిక్షణ సమయంలో ఇవి ఢీకొన్నట్లు పేర్కొంటున్నారు.

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు వ్యాయామాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/