Home / Padi Kaushik Reddy
Police Issued Notice To MLA Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10గంటలకు పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కౌశిక్‌రెడ్డితోపాటు 20మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐజీ శివధర్‌రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ […]
మీరు గెలిపించకపోతే డిసెంబర్ 4న నా శవయాత్రకి రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. తక్షణమే ఈ వ్యాఖ్యలపై స్థానిక రిటర్నింగ్ అధికారికి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో కౌశిక్ రెడ్డి తనకి ఓటేయాలంటూ అడిగిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న టూవీలర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. నీటి కాలువలోకి వెళ్లి ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
Padi Koushik: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో.. జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కమలాపూర్ లో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా లబ్దిదారుల పై అసహనం వ్యక్తం చేసారు.