Last Updated:

Flipkart Super Value Days Sale: ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ డేస్.. ఈ మూడు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. 18 వరకే ఛాన్స్..!

Flipkart Super Value Days Sale: ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ డేస్.. ఈ మూడు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. 18 వరకే ఛాన్స్..!

Flipkart Super Value Days Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త సేల్ ప్రకటించింది. సూపర్ వాల్యూ డేస్ సేల్‌ని తీసుకొచ్చింది. సేల్ ఈరోజు నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది.  దీనిలో మీరు మోటరోలా, నథింగ్, సామ్‌సంగ్ బ్రాండ్ ఫోన్లను బంపర్ డిస్కౌంట్లు, డీల్స్‌తో కొనుగోలు చేయచ్చు. అలానే ఈ సేల్‌లో ఈ ఫోన్‌లపై బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా ఈ ఫోన్‌లను బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.

Motorola G85 5G
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ ధర రూ.17,999. ఈ ఫోన్‌ను రూ. 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో సేల్‌లో కొనుగోలు చేయచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి Flipkart Axis బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఫోన్ రూ. 16,500 వరకు చౌకగా ఉంటుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్‌లో మీరు ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లే పొందుతారు. ఫోన్ Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్స్.

Nothing Phone (2a) 5G
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.25,999. రూ. 1500 వరకు బ్యాంక్ తగ్గింపుతో ఈ ఫోన్ సేల్‌లో మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే వినియోగదారులు 5 శాతం 6 క్యాష్‌బ్యాక్ పొందుతారు. 24,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. నథింగ్ ఈ ఫోన్ డైమెన్షన్ 7200 ప్రో చిప్‌సెట్‌లో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో ఇచ్చిన ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే 6.7 అంగుళాలు. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో ఇచ్చిన సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్స్. ఫోన్ బ్యాటరీ 5000mAh, ఇది 45 వాట్ల ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Samsung Galaxy S23 5G
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ సామ్‌సంగ్ ఫోన్ ధర రూ.42,999. మీరు ఈ ఫోన్‌ను 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్. ఈ హ్యాండ్‌సెట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 39,200 చౌకగా ఉంటుంది. కంపెనీ ఫోన్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లేను ఇస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్స్. ఈ ఫోన్ Snapdragon 8 Gen 2లో పని చేస్తుంది.