Redmi Note 14 Pro 4G: దుమ్ము లేపుడే.. రెడ్‌మి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది..!
Redmi Note 14 Pro 4G: టెక్ కంపెనీ రెడ్‌మి త్వరలో నోట్ 14 సిరీస్ కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రెడ్‌మి నోట్ 14 ప్రో 4జీ వేరియంట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయింది. ఫోన్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో FHD+ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
IMEI డేటాబేస్ ప్రకారం Redmi Note 14 Pro 4G స్మార్ట్‌ఫోన్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల FHD+ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉందని నిర్ధారిస్తుంది. రెడ్‌మి నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ రెండూ రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5G సిరీస్ మాదిరిగా డిస్‌ప్లే సైజ్ ఉంటాయి. డిస్‌ప్లే 2712×1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
జాబితా ప్రకారం.. హ్యాండ్‌సెట్ మల్టీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. ఈ ఫోన్ 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB, 12GB+512GB స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రెడ్‌మీ నోట్14 ప్రో 4G బ్యాటరీ 5,500mAh వరకు ఉంది. అయితే ఛార్జింగ్ స్పీడ్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
దీనితో పాటు రెడ్‌మి నోట్ 14 ప్రో కోడ్‌నేమ్ ‘అబ్సిడియన్’. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో వస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. ఫోన్ లాంచ్ సమయంలో మాత్రమే మిగిలిన సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మీ నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 Ultra ప్రాసెసర్‌తో వస్తుంది. ప్రో+ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది. రెండు మోడల్‌లు గరిష్టంగా 12GB, 16GB RAMతో పాటు 128GB నుండి 512GB వరకు స్టోరేజ్‌తో వస్తాయి.
కెమెరా ప్రియుల కోసం నోట్ 14 ప్రో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో వస్తుంది. 14 ప్రో ప్లస్ వేరియంట్ లైట్ ఫ్యూజన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాతో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.
రెండు మోడల్స్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. పవర్ విషయంలో రెడ్‌మి నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. అయితే Note 14 Pro+ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పెద్ద 6200mAh బ్యాటరీతో ఉంటుంది.