Last Updated:

Realme Narzo 60: భారత్ మార్కెట్లోకి రియల్ మీ నార్జో 60.. ఫొటోల సైజు మనిష్టమంట

Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది.

Realme Narzo 60: భారత్ మార్కెట్లోకి రియల్ మీ నార్జో 60.. ఫొటోల సైజు మనిష్టమంట

Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60 5Gస్మార్ట్ ఫోన్ తీసుకురానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లకు సంబంధించి మైక్రోసైట్ లాంచ్ చేసే ముందు స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలను ఆ సంస్థ రివీల్ చేసింది.

త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుందని తెలిపింది. ఈ రియల్‌మి నార్జో 60 సిరీస్ 2లక్షల 50వేల ఫొటోలు కన్నా ఎక్కువ స్టోరేజీ చేయగలదని పేర్కొంది. ఆ ఫిగర్ 1 టెరా బైట్కి దగ్గరగా ఉంటుందని సూచిస్తుంది.

ఫొటోల సైజును తగ్గించుకోవచ్చు(Realme Narzo 60)

అయితే, స్మార్ట్‌ఫోన్ కెమెరా రిజల్యూషన్, క్యాప్చర్ చేసే ఫొటోల సైజును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా, టీజ్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఇన్‌బిల్ట్ స్టోరేజీకి సంబంధించినదా లేదా మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మొత్తం స్టోరేజీ కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

జూలై 22, జూలై 26 తేదీలలో రియల్‌మి హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ హ్యాండ్‌సెట్ లాంచ్ ఈ నెలాఖరులో జరగవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 22,999 ఉండవచ్చనే అంచనా ఉంది.

ఇకపోతే ఇదివరకు రియల్ మీ  N53 పేరుతో ఓ కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది. నార్జో ఎన్ సిరీస్ లో వచ్చిన రెండో ఫోన్ ఇది. కాగా గత నెలలో నజ్రో N55 ను రియల్ మీ రిలీజ్ చేసింది. తక్కువ ధరలో 4 జీ ఫోన్ కోసం చేసే వారు ఈ ఫోన్ ను చూడొచ్చు.