Last Updated:

Amazon Great Indian Festival Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. సామ్‌సంగ్ మొబైల్‌పై రూ.25 వేల డిస్కౌంట్..!

Amazon Great Indian Festival Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. సామ్‌సంగ్ మొబైల్‌పై రూ.25 వేల డిస్కౌంట్..!

Amazon Great Indian Festival Sale: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్‌సంగ్ పెద్ద మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ లిస్ట్‌లో భాగంగా మారింది. దాని ఫ్లాగ్‌షిప్ పరికరాలు కెమెరా నుండి డిస్‌ప్లే వరకు శక్తివంతమైనవి. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ సందర్భంగాకంపెనీ ఫ్లాగ్‌షిప్ మొబైల్ గెలాక్సీ S24 5జీ వినియోగదారులకు లాంచ్ ధర కంటే రూ. 25,000 చౌకగా అందుబాటులో ఉంది.

గెలాక్సీ S24 5జీ Galaxy AIతో పాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లక్షణాలతో వస్తుంది. ఇది వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది పెద్ద 6.2-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందిస్తుంది. విశేషమేమిటంటే ఆండ్రాయిడ్ 14తో వస్తున్న ఈ డివైజ్ వచ్చే ఏడేళ్లపాటు మేజర్ అప్‌డేట్‌లను పొందుతూనే ఉంటుంది.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కారణంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ  వేరియంట్ 8జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమెజాన్‌లో రూ. 55,700 ధరకు జాబితా చేయబడింది. ఇది కాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపుపై రూ. 1000 వరకు ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ సంవత్సరం ప్రారంభంలో రూ.79,999 ధరతో ప్రారంభించారు. అంటే లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.25 వేల భారీ తగ్గింపు వినియోగదారులకు లభిస్తోంది.

కస్టమర్లు తమ పాత ఫోన్‌ని మార్చుకోవాలనుకుంటే, వారు గరిష్టంగా రూ. 48,850 వరకు తగ్గింపు పొందవచ్చు, దీని విలువ పాత ఫోన్ మోడల్. స్థితిపై ఆధారపడి ఉంటుంది. మొబైల్ ఒనిక్స్ బ్లాక్, మార్బుల్ గ్రే, కోబాల్ట్ వైలెట్, అంబర్ ఎల్లో వంటి కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 2600nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.2-అంగుళాల డైనమిక్ LTPO ఆమ్లోడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే‌కి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ ఉంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఆధారంగా OneUI సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే గెలాక్సీ S24 5G వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఈ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. దీని 4000mAh బ్యాటరీ 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ పొందుతుంది.