Home / Telangana
CM Revanth Reddy Comments on kcr in Nizamabad: రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించినా ఇంకా మార్పు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను ప్రజలు […]
Telangana SLBC Tunnel Collapse Rescue Operation Underway: తెలంగాణలోని అచ్చంపేట మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు సైతం రంగంలోకి దిగి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో […]
Telangana pilgrims die in uttar pradesh road accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇంకా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కార్ డ్రైవర్ మల్లారెడ్డి మృతి చెందారు. వీరంతా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం […]
Telangana Govt Invites New Firms To Supply Liquor Brands: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త లిక్కర్ బ్రాండ్స్‌ను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. సెల్ఫ్ […]
Hyderabad Metro MD NVS Reddy on Future City Metro Rail Project: ప్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌కు సంబంధించిన సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ దార్శనికత దిశగా అడుగులు […]
CM Revanth Reddy Unveils Yadagirigutta Temple Golden Vimana Gopuram: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా బంగారు గోపురాన్ని సీఎం ఆవిష్కరించారు. స్వర్ణతాపడం కోసం రూ.80కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.80కోట్లతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి ఈ స్వర్ణతాపడాన్ని […]
IPS officers Transferred in Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు మరోసారి జరిగాయి. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇందులో హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ […]
Meat prices Increased Due to Bird Flu Effect: ఏపీతో పాటు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చోటుచేసుకుంది. యాద్రాది జిల్లాలో తొలి బర్డ్ ఫ్లూ కేసులు నమోదైంది. మరోవైపు పలు జిల్లాలో వేల కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. గత రెండు రోజులుగా చికెన్‌తో పాటు గుడ్లు కూడా తినడం మానేశారు. ఈ క్రమంలో మటన్, చేపలకు భారీగా డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు తగ్గుతుండగా.. మటన్ ధరలు విపరీతంగా […]
TGSRTC to operate 3000 special buses for Maha Shivaratri: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 26న మహాశివరాత్రి కాగా, 24 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714 ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు […]
Miss World Competition To Be Held In Hyderabad: మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. పోటీలు మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ముగింపు వేడుకలు కూడా హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు 120 […]