Home / Telangana High Court
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు పేర్కొంది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది.
తెలంగాణ హైకోర్టులో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుకి సంబంధించి సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్నీ అబద్దాలే ఉన్నాయని అజయ్ కల్లం పిటిషన్లో తెలిపారు. 2023 ఏప్రిల్ 29న సీబీఐ తన స్టేట్మెంట్ రికార్డు చేసిందని అజయ్ కల్లం చెప్పారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విచారణని తిరగతోడాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నానని జోగయ్య ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సింధు ఫౌండేషన్ కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసారథి రెడ్డి వ్యవహరిస్తున్నారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్ అవినాష్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో సమస్యలపై ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశాడు.