Home / Telangana High Court
బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్ట్ బ్రేక్ వేసింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జనవరి 11 వరకు సినిమా రిలీజ్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను క్యాన్సల్ చేస్తూ తీర్పునిచ్చింది.
Director Raghavendra Rao: చిక్కుల్లో పడ్డ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . ఆయనకు తెలంగాణా హైకోర్ట్ నుంచి నోటీసులు. ఓభూమికి సబంధిచిన వివాదంలో ఆయనకు నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన భూమిని ఆయన సొంత అవసరాలు వాడుకున్నారన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు రాఘవేంద్ర రావు.
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.
తెలంగాణ హైకోర్టు బుధవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్‌సిసిఎల్ )లో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ ఎన్నికలను డిసెంబర్ 27 కి వాయిదా వేసింది. ఎస్‌సిసిఎల్ చేసిన అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత హైకోర్టు తన తీర్పును వెలువరించింది. నవంబర్ 30లోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ హైకోర్టు డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ నకు ఊహించని షాకిచ్చింది. మాదాపూర్ ప్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని 29వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. కాగా ఈ ఆరోపణలను నవదీప్ తోసిపుచ్చుతున్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయులకి హైకోర్టు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పులకు లోబడి బదిలీలు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు సవరించింది.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు పేర్కొంది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది.
తెలంగాణ హైకోర్టులో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుకి సంబంధించి సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్నీ అబద్దాలే ఉన్నాయని అజయ్ కల్లం పిటిషన్లో తెలిపారు. 2023 ఏప్రిల్ 29న సీబీఐ తన స్టేట్మెంట్ రికార్డు చేసిందని అజయ్ కల్లం చెప్పారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విచారణని తిరగతోడాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నానని జోగయ్య ప్రకటించారు.