Ajay kallam: తెలంగాణ హైకోర్టులో అజయ్ కల్లం రిట్ పిటిషన్.. ఎందుకో తెలుసా ?
తెలంగాణ హైకోర్టులో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుకి సంబంధించి సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అన్నీ అబద్దాలే ఉన్నాయని అజయ్ కల్లం పిటిషన్‌లో తెలిపారు. 2023 ఏప్రిల్ 29న సీబీఐ తన స్టేట్‌మెంట్ రికార్డు చేసిందని అజయ్ కల్లం చెప్పారు.

Ajay kallam: తెలంగాణ హైకోర్టులో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుకి సంబంధించి సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అన్నీ అబద్దాలే ఉన్నాయని అజయ్ కల్లం పిటిషన్‌లో తెలిపారు. 2023 ఏప్రిల్ 29న సీబీఐ తన స్టేట్‌మెంట్ రికార్డు చేసిందని అజయ్ కల్లం చెప్పారు.
కొందరిని ఇరికించాలని..( Ajay kallam)
అయితే తానిచ్చిన స్టేట్‌మెంట్‌కు విరుద్దంగా చార్జిషీట్‌లో పేర్కొన్నారని అన్నారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలన్నారు. కొందరిని ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే.. సీబీఐ పనిచేస్తోందని అజయ్ కల్లం ఆరోపించారు. చార్జిషీట్‌లో తాను చెప్పినట్లు సీబీఐ పేర్కొన్న అంశాలను కొట్టేయాలని హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. అజయ్‌కల్లం రిట్ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
రెండు నెలల కిందట అజయ్ కల్లం ఈ కేసు గురించి మాట్లాడుతూ సిబిఐ అధికారి నన్ను కలిసి మాట్లాడారు.నాకు తెలిసిన సమాచారం చెప్పాను. వివేకా మరణం గురించి వైఎస్ జగన్ మాకు చెప్పారు.వివేకా గుండెపోటుతో చనిపోయారని మాకు చెప్పలేదు.గుండెపోటా.? మరో కారణమా అన్న విషయం సిబిఐ అడగలేదు.ఆ సమయంలో ఉన్న నలుగురిలో నేను ఒకడిని.ఏ సమయంలో చెప్పారన్నది నాకు గుర్తు లేదు.వివేకా హత్య కేసులో విషయాలని వక్రీకరించ కూడదు. దర్యాప్తు అంశాలు లీక్ కావడం కూడా సరికాదని అజయ్ కల్లాం అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Road Accident : మహారాష్ట్రలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
- Telangana Floods : తెలంగాణలో వరదల భీభత్సానికి 23 కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు !