Harirama Jogaiah: సీఎం జగన్ కేసులపై కోర్టుకు వెడతాను.. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విచారణని తిరగతోడాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నానని జోగయ్య ప్రకటించారు.

Harirama Jogaiah: కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విచారణని తిరగతోడాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నానని జోగయ్య లేఖ విడుదల చేసారు.
జగన్ దోషా.? నిర్దోషా అన్న నిజం తెలియాలి..(Harirama Jogaiah)
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కేసుల విచారణ ఎందుకు పెండింగులో ఉందని జోగయ్య ప్రశ్నించారు. 11 సిబిఐ, 7 ఈడీ కేసుల విచారణ ఏమైందని జోగయ్య నిలదీశారు. హైకోర్టు డైరక్షన్ వల్లే కేసులు నమోదయ్యాయని జోగయ్య గుర్తు చేశారు. నేతలపై ఉన్న కేసులని సత్వరం పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని జోగయ్య తెలిపారు.సుప్రీంకోర్టు ఆదేశాలున్నా సిబిఐ కోర్టు రోజువారీ విచారణ చేపట్టకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని జోగయ్య అన్నారు. 2024 సంవత్సరంలో జనరల్ ఎన్నికలు రాబోతున్నాయని, జగన్ దోషా.? నిర్దోషా అన్న నిజం ప్రజలకి తెలియాల్సి ఉందని జోగయ్య తెలిపారు.
ఈ కేసుల తీర్పుని బట్టే వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా పోటీకి అర్హత ఉందా లేదా తేలుతుందని జోగయ్య స్పష్టం చేశారు. నిర్దోషులకి, నీతివంతులకి మాత్రమే చట్ట సభలకి పోటీ చేసే అవకాశం ఉంటుందని జోగయ్య తేల్చి చెప్పారు. అందుకే సీఎం జగన్ కేసులో విషయంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని జోగయ్య ప్రకటించారు. ఈ కేసుల విచారణలో సిబిఐకి డైరక్షన్ ఇవ్వాలని హైకోర్టుని కోరుతానని జోగయ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 9th Nizam Nawab: 9వ నిజాంగా బాధ్యతలు చేపట్టిన నవాబ్ రౌనక్ యార్ ఖాన్
- Odisha Train Track Resume: బాలాసోర్ రైలు ప్రమాదస్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పూర్తి.. రైళ్లకు రూట్ క్లియర్