Home / national news
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ను ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అష్ఫాఖుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్లో చిరుత పిల్లకు పాలు తాగించారు.
వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ గురువారం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్య దుమారం రేపింది.
పంజాబ్ విజిలెన్స్ విభాగం అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కోటి రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలపై ఏఐజీ ఆశిష్ కపూర్ ను అరెస్ట్ చేసారు.
భారత్ టెలికం మార్కెట్లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్కమ్ ఆఫర్ను కూడా తీసుకొచ్చింది. వారికి అన్నీ ఉచితమంటూ ప్రకటించింది.
రాహుల్ జోడో యాత్రకు కొత్త బూస్ట్ వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోన్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడం కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ నింపింది.
ఓ బ్యాంకులో సుమారు రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీకి గురయ్యింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా విస్తుపోయే నిజం వెల్లడయ్యింది. ఆఖరికి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 9కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే. ఈ చోరీ ఘటన మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో బ్యాంక్లో జరిగింది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకుంది. కాగా రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు. అందువల్ల ప్రభాస్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన రావణదహనం కార్యక్రమంలో పాల్గొన్నాడు.
కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందగా మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.