Home / latest international news
బంగ్లాదేశ్‌లో దశాబ్దం తర్వాత ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయి. దీంతో దేశంలో తరచూ కరెంటు కోతలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశంలో ఇంధన కొరతతో విద్యుత్ కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు.. మరో పక్క కరెంటు కోతలతో బంగ్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం పాక్ జీడీపీ 3.5 శాతంగా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ మంగళవారం నాడు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రపంచబ్యాంకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు శాతం దాటితే మహా గొప్ప అని పెదవి విరిచింది. దీనికి వరల్డ్ బ్యాంకు ఇస్తున్న వివరణ ఇలా ఉంది.
ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు.
రష్యా నియంత్రణలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లో సోవియట్ కాలం నాటి భారీ కట్టడం అయిన నోవా కఖోవ్కా డ్యామ్ వీడియో తెగిపోయినట్లు వీడియో వైరల్ అయింది. రష్యా, ఉక్రెయిన్లు ఉద్దేశపూర్వక దాడికి పాల్పడ్డారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.వీడియోలు డ్యామ్ అవశేషాల గుండా నీరు ప్రవహించడాన్ని చూపించాయి.
పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్ లో గత మూడు రోజుల హింసాత్మక నిరసనలతో 16 మంది మరణించారు. ప్రతిపక్ష నేత ఉస్మాన్ సోంకోకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత నిరసనలు చెలరేగినట్లు అంతర్గత మంత్రి ఆంటోయిన్ డియోమ్ తెలిపారు.
Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన క్లబ్ కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు ఉండడంతో ఆయన ఆ క్లబ్ నుంచి బయటకు రావాల్సివచ్చింది.
సెక్స్‌ను అధికారికంగా క్రీడగా నమోదు చేసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా స్వీడన్ అవతరించింది. జూన్ 8న గోథెన్‌బర్గ్‌లో మొట్టమొదటి యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్‌ను కూడా నిర్వహించనుంది.స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ మార్గదర్శకత్వంలో జరిగే ఈ ఛాంపియన్షిప్, సెడక్షన్, ఓరల్ సెక్స్, పెనిట్రేషన్ మరియు మరిన్నింటితో సహా 16 విభాగాల కింద లైంగిక కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులతో ఆరు వారాల పాటు కొనసాగుతుంది.
రెండు ఐక్యరాజ్యసమితి సంస్థలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) పాకిస్తాన్లో తీవ్రమైన ఆహార అభద్రతను అంచనా వేసింది, ఇది ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చితే రాబోయే నెలల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. ఏకంగా 37.97 శాతానికి ఎగబాకింది. గత ఏడాది మే 2022తో పోల్చుకుంటే ఈ ఏడాది రవాణా ఖర్చులతో పాటు నాన్ పెరిషబుల్గూడ్స్ ధరల ఏకంగా 50 శాతంగాపైనే ఎగబాకాయి. గత 12 నెలల కాలానికి చూస్తే సరాసరి ద్రవ్యోల్బణం 29.16 శాతంగా నమోదయింది.
ఫ్లోరిడాకు చెందిన 14 ఏళ్ల విద్యార్థి దేవ్ షా, జూన్ 1, 2023, గురువారం నాడు యునైటెడ్ స్టేట్స్లో 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీని గెలుచుకున్నాడు. భారతీయ సంతతికి చెందిన అతను శామాఫైల్ అనే పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చేసి $50,000 నగదు బహుమతిని గెలుచుకున్నాడు.