Home / latest international news
దుఃఖంపై పుస్తకాన్ని వ్రాసి తన భర్తను హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మహిళ కౌరీ రిచిన్స్, అమెరికాలో ధనవంతుల కోసం లగ్జరీ జైళ్ల గురించి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు తెలిసింది. కోర్టులో సోమవారం విచారణ సందర్భంగా రిచిన్స్ యొక్క గూగుల్ శోధనలు వెల్లడయ్యాయి
ఉత్తర నైజీరియాలో వివాహ వేడుక నుండి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడింది, దీని ఫలితంగా సోమవారం పిల్లలతో సహా కనీసం 103 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ఇలోరిన్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలో నైజర్ నదిపై సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడింది.
: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్‌పై రష్యా దళాలు మంగళవారం క్షిపణులను ప్రయోగించడంతో కనీసం 11 మంది మరణించారు.క్షిపణులు నివాస భవనంతో సహా పౌర ప్రదేశాలను తాకినట్లు మేయర్ ఒలెక్సాండర్ విల్కుల్ తెలిపారు.మరో 28 మంది గాయపడ్డారని, ఒక వ్యక్తి శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్నామని విల్కుల్ తెలిపారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.ట్రక్ రైడ్ సమయంలో అతను కొన్ని పాటలను ప్లే చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించారు. ఏ పాట అని అడిగినప్పుడు, అతను సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండిఅని బదులిచ్చారు.
నెదర్లాండ్స్ లోని ఒక పట్టణం స్థానికుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత బీచ్ సందర్శకులను బీచ్‌లో మరియు మట్టి దిబ్బలలో సెక్స్ చేయకుండా నిరోధించడానికి ప్రచారాన్ని ప్రారంభించింది.
ఈ నెలాఖరున అమెరికా వెడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేసిన ప్రత్యేక ‘థాలీ’ రూపంలో అద్భుతమైన స్వాగతాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూజెర్సీకి చెందిన ఓ రెస్టారెంట్లో ఆయన అమెరికాకు రాకముందే ‘మోదీ జీ థాలీ’తయారీకి రంగం సిద్దమయింది.
సెంట్రల్ లండన్‌లోని హార్స్ గార్డ్స్ పరేడ్‌లో శనివారం ప్రిన్స్ విలియం తనిఖీ చేసిన రాయల్ మిలిటరీ కవాతులోముగ్గురు బ్రిటీష్ గార్డ్లు ఎండవేడికి మూర్ఛపోయారు. యూకేలో ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం మొదటిసారిగా 30 డిగ్రీల సెల్సియస్ (86F) దాటాయి. హీత్రోలో 30.5°C మరియు తర్వాత సర్రేలో 31.2°C నమోదయ్యాయని స్కై న్యూస్ నివేదించింది.
ఉక్రెయిన్ లోని కఖోవ్కా ఆనకట్ట ధ్వంసంతో దక్షిణ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వరదల కారణంగా కనీసం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, రష్యా తన దళాల ఆధీనంలో ఉన్న భూభాగాల్లో కనీసం ఎనిమిది మంది మరణించినట్లు తెలిపింది.
జపాన్‌లోని ప్రధాన సుషీ రెస్టారెంట్ గ్రూప్ అయిన సుషిరో, తన అవుట్లెట్లలో ఒకదానిలో సోయా సాస్ బాటిల్‌ను రుచి చూసిన బాలుడిపై సుమారుగా 4 కోట్ల రూపాయలకు దావా వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం, రెస్టారెంట్ చైన్‌ను నడుపుతున్న అకిండో సుషిరో మార్చి 22 న ఒసాకా జిల్లా కోర్టులో దావా వేయగా, ఈ నెలలో వివరాలు వెల్లడయ్యాయి
: కెనడా అడవిలో ఏర్పడ్డ కార్చిచ్చు దానావలంలా ఆ పొగ కాస్తా న్యూయార్కు గగనతలంలోకి రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్రఆకాశం ఆరేంజి కలర్లోకి మారిపోయింది.