Home / India
టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో ఒకే రోజు 5,379 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. దీనితో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,44,72,241 కు చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 50,594కి తగ్గాయి. 27 మరణాలతో కోవిడ్ మరణాల సంఖ్య 5,28,057కి చేరుకుంది.
ఆసియా కప్ 2022 నేడు ఇండియా రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా హాంకాంగ్ పై బుధవారం రాత్రి 07:30 కు తల పడనుంది. మొదటి మ్యాచ్ ఆడిన ఇండియా పాకిస్థాన్ పై గెలిచి పాయింట్స్ టేబుల్లో గ్రూప్ - ఏ లో మొదటి స్థానంలో నిలిచింది.
పాకిస్థాన్‌లో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలతో ముంచేసింది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో వరదలు వల్ల అన్ని మునిగిపోయాయి. వరదల వల్ల వెయ్యికి పైగా మృతి చెందగా మూడు కోట్ల మంది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
వరదల కారణంగా పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో టమాటా, ఉల్లిపాయలను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ సర్కారు భావిస్తోంది. లాహోర్ మార్కెట్లలో కిలో టమాటా 500 రూపాయలు, కిలో ఉల్లి 400రూపాయల చొప్పున పలికాయి.
26 ఏళ్ల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టిన బాబా వంగా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగా ఊహించి జోస్యం చెప్పడంలో బాగా పేరు తెచ్చుకున్నారు. ఆమె 9/11 ఉగ్రవాద దాడులు మరియు బ్రెగ్జిట్ వంటి ప్రధాన సంఘటనలను ఆమె అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎన్జిసి మరియు ప్రైవేట్ రంగ సంస్థలచే నిర్వహించబడుతున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా భారతదేశం యొక్క ముడి చమురు ఉత్పత్తి జూలైలో 3.8 శాతం పడిపోయిందని మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటంతో భారత్ వ్యతిరేకతను తెలిపింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం మధ్యాహ్నం భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖర్ ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్లో దర్భార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా జగదీప్ ధన్ఖర్ వృత్తి రీత్యా లాయర్
కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే.