Last Updated:

CM Jagan: సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన కోడికత్తి శ్రీను కుటుంబం

వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ కోసం కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిందితుడి కుటుంబం బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చింది.

CM Jagan: సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన కోడికత్తి శ్రీను కుటుంబం

Andhra Pradesh: వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ కోసం కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిందితుడి కుటుంబం బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి లాయర్ సలీమ్‌తో పాటు శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. నాలుగు సంవత్సరాలుగా శ్రీను రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతుండడంతో తమ గోడు సీఎంకు చెప్పుకుందామని వచ్చినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం చాలా ప్రయత్నించామని అన్నారు.

కోడికత్తి కేసులో గత నాలుగుళ్లుగా తమ కుమారుడు శ్రీను రిమాండ్ ఖైదీగా ఉన్నాడని వారు వినతి పత్రంలో తెలిపారు. అందుకని శ్రీను బెయిల్‌ కోసం నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ లెటర్) ఇవ్వాలని అధికారులను కోరారు. తమకు వయసు పైబడిందని, వయోభారంతో ఉన్న తమకు జీవనం కష్టంగా మారిందని అన్నారు. తమ పోషణ కష్టంగా మారినందున జాలి చూపాలని, శ్రీనుకు బెయిల్ వచ్చేలా నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు. శ్రీను తరపున న్యాయవాది సలీమ్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా అండర్ ట్రైల్ లో ఉన్న ఖైదీని నాలుగేళ్లుగా జైల్లో పెట్టడం సరైంది కాదన్నారు కోడికెత్తి కేసులో ఎన్ ఐ ఏ చార్జ్ షీట్ వేసిన ఇప్పటివరకు విచారణ కూడా చేయలేదన్నారు. ఎన్ఐఏ విచారణ కావాలని గతంలో వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు.వైయస్ జగన్ అభ్యర్ధన మేరకు ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేసు తీసుకుని నిందితుడికి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. సీఎం జగన్ ను మళ్ళీ కలిసేందుకు అవకాశం ఇస్తామని సీఎంఓ అధికారులు తెలిపారని అన్నారు.

నాలుగేళ్ల కిందట విశాఖపట్నం ఎయిర్ పోర్టులో హైదరాబాద్ వెళ్లేందుకు నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఎయిర్ పోర్ట్ క్యాంటీన్‌లో పని చేసే శీను అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి కోడి పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతోజగన్‌ భుజానికి గాయమైంది. దాడి జరిగిన వెంటనే శీనును సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి: