RR Vs RCB 42nd Match: నాలుగోసారి టాస్ ఓడిన బెంగళూరు.. రాజస్థాన్ జట్టులో కీలక మార్పు!

Rajasthan Royals Choose to Bowl first against Royal Challengers Bengaluru in IPL 42nd Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 నిమిషాలకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది.
ఇక, ఈ మ్యాచ్‌కు సంజు శాంసన్ దూరంగా ఉన్నారు. దీంతో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే రాజస్థాన్ జట్టులో ఓ కీలక మార్పు చేశారు. మహీశ్ తీక్షణ స్థానంలో ఫజల్ ఫారేఖీని తీసుకున్నారు.
ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు 8 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగతా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. మిగతా 6 మ్యాచ్‌ల్లో ఓటమితో 8వ స్థానంలో కొనసాగుతోంది.
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ రికార్డు అందుకునే అవకాశం ఉంది. కోహ్లీ 3 సిక్స్‌లు కొడితే టీ20 క్రికెట్‌లో 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా రికార్డు నెలకొంటుంది. ఇక, సీజన్‌లో ఆర్సీబీ సొంతగడ్డపై నాలుగో మ్యాచ్ ఆడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.
బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదర్(కెప్టెన్), దేవ్ దత్ పడిక్కల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, యశ దయాళ్.
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్ మయర్, వానిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, ఫజల్ ఫారూకీ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ.