KKR vs LSG: పురాన్ అర్దసెంచరీ.. కోల్ కతా లక్ష్యం 177 పరుగులు
KKR vs LSG: ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరో మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
KKR vs LSG: పురాన్ వరుస సిక్సులతో రెచ్చిపోయాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్, బదోని, మన్ కడ్ రాణించారు. కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా, ఠాకూర్, నరైన్ తలో రెండు వికెట్లు తీశారు. చక్రవర్తి, రాణా చెరో వికెట్ పడగొట్టారు
LIVE NEWS & UPDATES
-
KKR vs LSG: పురాన్ అర్దసెంచరీ.. కోల్ కతా లక్ష్యం 177 పరుగులు
పురాన్ వరుస సిక్సులతో రెచ్చిపోయాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్, బదోని, మన్ కడ్ రాణించారు. కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా, ఠాకూర్, నరైన్ తలో రెండు వికెట్లు తీశారు. చక్రవర్తి, రాణా చెరో వికెట్ పడగొట్టారు.
-
KKR vs LSG: పురాన్ అర్దసెంచరీ.. ఏడో వికెట్ కోల్పోయిన లక్నో
పురాన్ వరుస సిక్సులతో రెచ్చిపోయాడు. వరుసగా రెండు బంతుల్లో సిక్సులు కొట్టి థాకూర్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
-
KKR vs LSG: 16 ఓవర్లకు 122 పరుగులు
16 ఓవర్లు పూర్తయ్యేసరికి లక్నో 122 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పూరన్, బదోని ఉన్నారు.
-
KKR vs LSG: వరుస వికెట్లు కోల్పోతున్న లక్నో
లక్నో వరుస వికెట్లు కోల్పోతుంది. చక్రవర్తి బౌలింగ్ లో డికాక్ క్యాచ్ ఔటయ్యాడు.
-
KKR vs LSG: నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. కెప్టెన్ ఔట్
లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్ లో కృనాల్ పాండ్యా క్యాచ్ ఔటయ్యాడు.
-
KKR vs LSG: మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. స్టాయినిస్ డకౌట్
లక్నో మూడో వికెట్ కోల్పోయింది. వైభవ్ బౌలింగ్ లో స్టాయినిస్ డకౌట్ అయ్యాడు.
-
KKR vs LSG: రెండో వికెట్ కోల్పోయిన లక్నో..
లక్నో రెండో వికెట్ కోల్పోయింది. వైభవ్ బౌలింగ్ లో మన్ కడ్ క్యాచ్ ఔటయ్యాడు.
-
KKR vs LSG: ముగిసిన పవర్ ప్లే.. 54 పరుగులు చేసిన లక్నో
మెుదట్లో తడబడిన లక్నో.. పవర్ ప్లే ముగిసేసరికి పుంజుకుంది. ఆరు ఓవర్లకు 54 పరుగులు చేసింది.
-
KKR vs LSG: తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. కరణ్ శర్మ ఔట్
లక్నో మెుదటి వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
-
KKR vs LSG: రెండు ఓవర్లకు 7 పరుగులు
లక్నో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. రెండు ఓవర్లు ముగిసేసరికి కేవలం 7 పరుగులే చేసింది.
-
KKR vs LSG: కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
-
KKR vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బడోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్