DC vs CSK: వార్నర్ ఔట్.. ముగిసిన గొప్ప ఇన్నింగ్స్
DC vs CSK: ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందుండాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.
DC vs CSK: దిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 86 పరుగుల వద్ద ఔటయ్యాడు.
చెన్నై ధాటిగా ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు గైక్వాడ్, కాన్వై విజృంభించి ఆడటంతో చెన్నై 200 పైచిలుకు స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి.. 223 పరుగులు చేసింది. కాన్వై 87 పరుగులు.. గైక్వాడ్ 79 పరుగులతో చెలరేగిపోయారు. చివర్లో దూబే, జడేజా సిక్సర్ల వర్షం కురిపించారు.
దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోర్జియా, సకారియా చెరో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
DC vs CSK: వార్నర్ ఔట్.. ముగిసిన గొప్ప ఇన్నింగ్స్
దిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 86 పరుగుల వద్ద ఔటయ్యాడు.
-
DC vs CSK: ఐదో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్
దిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. చాహర్ బౌలింగ్ లో అక్షర్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో చాహర్ మూడో వికెట్ తీసుకున్నాడు.
-
DC vs CSK: వార్నర్ విశ్వరూపం.. ఒకే ఓవర్లో 23 పరుగులు
జడేజా వేసిన ఓవర్లో వార్నర్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ ఓవర్లో ఏకంగా 23 పరుగులు చేశాడు.
-
DC vs CSK: వార్నర్ అర్దసెంచరీ..నాలుగో వికెట్ కోల్పోయిన దిల్లీ
వార్నర్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
-
DC vs CSK: వరుస బంతుల్లో వికెట్లు.. కష్టాల్లో దిల్లీ
దిల్లీ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. చాహర్ బౌలింగ్ లో సాల్ట్, రుస్సే వెంటవెంటనే ఔటయ్యారు.
-
DC vs CSK: మూడు ఓవర్లకు 9 తొమ్మిది పరుగులు
దిల్లీ తడబడుతోంది. మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో వార్నర్, సాల్ట్ ఉన్నారు.
-
DC vs CSK: తొలి వికెట్ కోల్పోయిన దిల్లీ.. షా ఔట్
దిల్లీ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. దేశ్ పాండే బౌలింగ్ లో షా క్యాచ్ ఔటయ్యాడు. అంబటి రాయుడు అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
DC vs CSK: దిల్లీ బ్యాటింగ్.. తొలి ఓవర్లో 5 పరుగులు
తొలి ఓవర్లో దిల్లీ 5 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో వార్నర్, పృథ్వి షా ఉన్నారు.
-
DC vs CSK: కాన్వే, రుతురాజ్ విధ్వంసం.. దిల్లీ లక్ష్యం 224 పరుగులు
చెన్నై ధాటిగా ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు గైక్వాడ్, కాన్వై విజృంభించి ఆడటంతో చెన్నై 200 పైచిలుకు స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి.. 223 పరుగులు చేసింది. కాన్వై 87 పరుగులు.. గైక్వాడ్ 79 పరుగులతో చెలరేగిపోయారు. చివర్లో దూబే, జడేజా సిక్సర్ల వర్షం కురిపించారు.
దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోర్జియా, సకారియా చెరో వికెట్ తీసుకున్నారు.
-
DC vs CSK: రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. క్రీజులోకి ధోని
చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. జోరుమీదున్న శివం దూబే క్యాచ్ ఔటయ్యాడు. దీంతో ధోని క్రీజులోకి వచ్చాడు.
-
DC vs CSK: సెంచరీకి చేరువలో కాన్వై.. సిక్సుల వర్షం
చెన్నై భారీ స్కోర్ దిశగా సాగుతుంది. కాన్వై, శివం దూబే సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు.
-
DC vs CSK: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. 79 పరుగులు చేసిన గైక్వాడ్ ఔటయ్యాడు. సకారియా బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
-
DC vs CSK: డెవాన్ కాన్వే అర్దసెంచరీ.. భారీ స్కోర్ దిశగా చెన్నై
డెవాన్ కాన్వే అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
చెన్నై బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఓపెనర్లు ధాటిగా ఆడుతుండటంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది.
-
DC vs CSK: ఒకే ఓవర్లో మూడు సిక్సులు
కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్లో గైక్వాడ్ రెచ్చిపోయాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు కొట్టాడు.
-
DC vs CSK: గైక్వాడ్ అర్దసెంచరీ
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
-
DC vs CSK: 7 ఓవర్లకు 62 పరుగులు
చెన్నై నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. 7 ఓవర్లు ముగిసేసరికి.. 62 పరుగులు చేసింది.
-
DC vs CSK: రెండో ఓవర్లో 13 పరుగులు
లలిత్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఇందులో ఓ సిక్సర్, ఫోర్ ఉంది.
-
DC vs CSK: తొలి ఓవర్లో 6 పరుగులు
ఖలీల్ మహ్మద్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. క్రీజులో కాన్వే, గైక్వాడ్ ఉన్నారు.
-
DC vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
-
DC vs CSK: దిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసొ, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే
-
DC vs CSK: టాస్ గెలిచిన చెన్నై
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.