Last Updated:

Jai shah: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా.. నాలుగో వ్యక్తిగా రికార్డు

Jai shah: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా.. నాలుగో వ్యక్తిగా రికార్డు

Jay Shah takes over as new ICC chairman: ఐసీసీ ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తాజాగా, ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా, భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగో వ్యక్తిగా జైషా రికార్డు నెలకొల్పారు. అయితే ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు.

అయితే, ఐసీసీ ఛైర్మన్‌గా జైషా(35) అతిచిన్న వయసులో ఎన్నికైనట్లు గుర్తింపు దక్కించుకున్నారు. దీంతో పాటు గతంలో భారత్ నుంచి శశాంక్ మనోహర్ 2015-20 మధ్య ఈ పదవిలో ఉన్నారు.

ఐసీసీ పదవిని చేపట్టడం గర్వంగా భావిస్తున్నట్లు జైషా తెలిపారు. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. మహిళల క్రికెట్‌ను అభివృద్ధిపై చేయడానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు ఆయన బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.