IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

IPL 2025 : ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్ జట్టు పరువు కోసం ఆడనుంది. వరుస ఓటములతో 9వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ సోమవారం గుజరాత్ టైటాన్స్‌ను తలపడనున్నది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
జోరు మీదున్న గుజరాత్..
వరుస విజయాలతో గుజరాత్ జోరు మీద ఉన్నది. పరాగ్ సేను ఓడిస్తే ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ కానుంది. మ్యాచ్‌తో గుజరాత్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్ అరంగేట్రం చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకోని సంజూ శాంసన్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండుజట్లు ఇప్పటి వరకూ ఏడు సార్లు తలపడగా, గుజరాత్ 6 విజయాలతో ఆధిక్యంలో ఉంది.
తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయిర్, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగ, మహీష తీక్షణ, శుభం దూబె, సందీప్ శర్మ ఉన్నారు.
ఇంప్యాక్ట్ ప్లేయర్స్ : శుభమ్ దూబే, కుమార్ కార్తికేయ, అకాశ్ మధ్వాల్, తుషార్ దేశ్‌పాండే, కునాల్ సింగ్ ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ జట్టు : శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.
ఇంప్యాక్ట్ ప్లేయర్స్ : ఇషాంత్ శర్మ, మహిపాల్ లొమ్‌రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, దసున్ శనక ఉన్నారు.