Varasudu: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాల జోరు మెుదలవుతుంది. అందులో భాగంగానే తమిళంలో నేడు విడుదలైంది విజయ్ నటించిన వారిసు సినిమా. ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపి నిర్మించారు. తెలుగులో వారసుడిగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
సినిమా టైటిల్ కి తగిన విధంగానే ఈ కథ ఉంటుంది. రాజేంద్రన్(శరత్ కుమార్) ఓ పెద్ద వ్యాపారవేత్త. తనకి ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్). ఇక విజయ్ కి తన తండ్రితో విభేదాల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో జయ్ ప్రకాష్(ప్రకాష్ రాజ్) రాజేంద్రన్ వ్యాపారాన్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తాడు. కాని హీరో ప్రకాష్ రాజ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకోని వ్యాపారానికి వారసుడు అయ్యడనేదే సినిమా కథ.
ఈ సినిమా చూస్తుంటే మనకు పాత సినిమాలు గుర్తుకురావడం ఖాయం. మణిరత్నం నవాబ్ సినిమాలో ఇదే కథ. కానీ దర్శకుడు తెలివిగా కార్పోరేట్ బ్యాక్ డ్రాప్ ని ఎన్నుకోవడం. ఇక్కడ కూడా చైర్మన్ పదవి కోసం వెన్నుపోటు పొడవడం.. కుట్రలు కనిపిస్తాయి. హీరో ఎంట్రీ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. కథలోకి వెళ్లేందుకు దర్శకుడు కాస్త సమయం తీసుకున్న ఆ లోటు ఎక్కడా రాకుండా చూసుకునే విధానం నచ్చుతుంది. రష్మికతో ప్రేమాయణం సైతం ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. కానీ రష్మికను చాలా తక్కువ సీన్లకే డైరెక్టర్ పరిమితం చేశారు.
ఈ సినిమాలో ఎవరి పాత్ర పరిధి మేరకు వారు నటించారు. సినిమాకు విజయ్ నటన హైలెట్ అవ్వగా.. విలన్ పాత్రలో ప్రకాష్ అలరిస్తాడు. రష్మిక, శ్రీకాంత్, అజయ్ తదితరులు నటనకు ప్రాధాన్యం ఉంటుంది.
విజయ్ నటన
కామెడీ సన్నివేశాలు
యోగిబాబు నటన
తెలిపిన కథ
కథనం
రేటింగ్ 2.5/5
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/